![]() |
![]() |
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -323 లో.....రామలక్ష్మికి స్వామి ఫోన్ చేసి జాగ్రత్తగా ఉండమని చెప్తాడు. శ్రీలత ఒక్కతే కిచెన్ లో వంట చేస్తూ కష్టపడుతుంటే.. అప్పుడే సందీప్, ధన , శ్రీవల్లి వచ్చి ఎందుకు అమ్మ ఇలా కష్టపడుతున్నావని అడుగుతారు. మనం మారామని వాళ్ళకి కూడా అర్ధమవ్వాలి అన్నట్లు శ్రీలత మాట్లాడుతుంది. తన తల్లిలో వచ్చిన మార్పు చూసి సిరి హ్యాపీగా ఫీల్ అవుతుంది. సిరి నువ్వు ఇక్కడే కూర్చొ నీకు టిఫిన్ రెడీ చేసి తీసుకొని వస్తానంటూ ధన అంటాడు.
అందరు కిచెన్ లో వర్క్స్ చేస్తూ ఉంటే.. రామలక్ష్మి, సీతాకాంత్ లు వస్తారు. మీరేంటి పనులు చేస్తున్నారని అడగగా మన పనులు మనం చేసుకోవడంలో తప్పేముందని సందీప్ అంటాడు. ఇన్ని రోజులు మీరు మా గురించి అలోచించి మీ గురించి అలోచించలేదు.. అందుకే ఇక మీరు పిల్లల్ని కనే పనిలో ఉండండి.. నాకు నా చేతిలో మానవడినో, మానవరాలినో ఇస్తే నేను హ్యాపీగా ఉంటానని శ్రీలత అంటుంది. అవునని సిరి అంటుంది. ఇప్పటికి వరకు ఆలోచించలేదు ఇక ఆలోచిస్తామని సీతాకాంత్ కాస్త సిగ్గు పడుతూ అంటాడు. రామలక్ష్మి, సీతాకాంత్ లు బయటకు వస్తారు. ఇద్దరు సరదాగా మాట్లాడకుంటూ.. ఒక గేమ్ ఆడుతారు ట్రూత్ ఆర్ డేర్ ఆడుతారు. సీతాకాంత్ కి రామలక్ష్మి ఒక రోజ్ ఇచ్చి తను ఒక అమ్మాయిని చూపించి ప్రపోజ్ చెయ్యమని చెప్తుంది. దంతో సీతాకాంత్ ఇబ్బంది పడ్డా కూడా వెళ్లి ఆ అమ్మాయి కి రోజ్ ఇస్తాడు. ఆ తర్వాత రామలక్ష్మి వంతు కాగా.. ఇప్పుడు నువ్వు నిజం చెప్పు నన్ను ఎందుకు ప్రపోజ్ చెయ్యమన్నావ్.. నిజం చెప్పు అంటాడు. నేను లేకపోతే మీరు వేరొకరితో ఉంటారో లేదోనని రామలక్ష్మి అంటుంది. ఏంటని సీతాకాంత్ కాస్త కోపంగా అనగానే.. రామలక్ష్మి కవర్ చేస్తుంది.
శ్రీలత, సందీప్ లు లాయర్ ని పిలిపించి మాట్లాడతారు. శ్రీలత ఎవరికో ఫోన్ చేసి మాట్లాడుతుంది. ఏంటి అత్తయ్య గారు ఏం చేస్తున్నారని శ్రీవల్లికి అర్ధం కాదు. వాళ్ళు మాట్లాడేది కూడా శ్రీవల్లికి వినిపించదు. మరొక వైపు రామలక్ష్మి, సీతాకాంత్ లు గుడికి వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |